నకిలీ సందేశాలకు ఎవరూ స్పందించవద్దు : ములుగు జిల్లా కలెక్టర్
తన పేరు, ఫొటోను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు పంపుతున్న నకిలీ వాట్సాప్ సందేశాలకు ఎవరూ స్పందించవద్దని, ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
CollectorCollector

ములుగు, 06 అక్టోబర్ (హి.స.)

తన పేరు, ఫొటోను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు పంపుతున్న నకిలీ వాట్సాప్ సందేశాలకు ఎవరూ స్పందించవద్దని, ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తన పేరు, ఫొటోను వాట్సాప్ డి.పి.లో పెట్టుకుని +66 98 476 2993 నెంబర్ నుంచి అధికారులకు సందేశాలు పంపుతున్నట్లు గుర్తించామని, ఈ నెంబర్ నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దని, వెంటనే సంబంధిత నంబర్ను బ్లాక్ చేసి, వాట్సాప్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

తన పేరుతో అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సందేశాలను విశ్వసించవద్దని, అలాంటి సందేశాల ద్వారా డబ్బులు, బహుమతి కార్డులు అడిగినా స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, రహస్య సంకేత సంఖ్యలను ఎవరికీ ఇవ్వవద్దని కోరారు. అనుమానాస్పద సందేశాలు వస్తే సంబంధిత సైబర్ నేరాల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆ ప్రకటనలో సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande