మహిళలు, విద్యార్థినిల రక్షణకై పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు.. జిల్లా ఎస్పీ
మహిళలు, బాలికలు,విద్యార్థినిలను వేధించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
Sp


రాజన్న సిరిసిల్ల, 06 అక్టోబర్ (హి.స.)

మహిళలు, బాలికలు,విద్యార్థినిలను వేధించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.

గడిచిన రెండు నెలల్లో షీ టీమ్కు వచ్చిన ఫిర్యాదులలో నాలుగు ఎఫ్ఎఆరు, 5 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు.

జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మహిళలు, విద్యార్థినిలు, బాలికలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే ఒక ఫోన్ కాల్ చేస్తే రక్షణ కవచంలా జిల్లా షీ టీమ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

ముఖ్యంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని, సామాజిక మాద్యమాల్లో పరిచయమయ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం ఉండాలని సూచించారు.

షీ టీమ్ బృందం విద్యాసంస్థల్లో, మహిళలు పని చేసే ప్రదేశాల్లో, రద్దీగల ప్రాంతాల్లో విద్యార్థులకు, మహిళలకు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, సోషల్ మీడియా మోసాలు, మహిళా చట్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande