400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేశారు: సీఎం రేవంత్ రెడ్డి
రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy


హైదరాబాద్ , 01 నవంబర్ (హి.స.)

రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి వల్లే దళితులు, గిరిజనులు, మహిళలు, యువతకు సమాన హక్కులు, ఓటు హక్కు లభించాయని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను విడదీస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా విభజించి పాలించే విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు.

గతంలో లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీకి మూడోసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను దూరం చేయాలనే కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande