రాంలీలా మైదానానికి బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు
ఢిల్లీలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాంలీలా మైదానానికి బయలుదేరారు.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 01 నవంబర్ (హి.స.)

ఢిల్లీలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాంలీలా మైదానానికి బయలుదేరారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి నేతృత్వంలో నేతల బృందం సభా ప్రాంగణానికి పయనమైంది. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

సభలో తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రాజకీయ పరిణామాలపై నేతలు ప్రసంగించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణ భవన్ నుంచి రాంలీలా మైదానం వరకు నేతల రాకతో ఢిల్లీలో రాజకీయ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్న ఈ సభపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande