రంగారెడ్డి జిల్లాలో కారు బోల్తా.. ఒకరు మృతి, ఇద్దరు సీరియస్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Accident


హైదరాబాద్, 01 నవంబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామెన గేటు సమీపంలోని బ్రిడ్జి వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాద సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

చేవెళ్ల మండల పరిధిలోని పామెన గేటు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బ్రిడ్జి వద్ద అదుపుతప్పి అవతలి రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు, స్థానికులు వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande