
అమరావతి , 10 నవంబర్ (హి.స.)
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన 30కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమలు, రెవెన్యూ, హోంశాఖలకు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి అనుమతులు ఇచ్చింది.
రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన అంశాలకు ఈ సమావేశంలో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ, పరిశ్రమల శాఖల ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల పెంపునకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. రెవెన్యూ, హోంశాఖలకు సంబంధించిన అంశాలపైనా మంత్రివర్గం చర్చించింది.
మొత్తంగా 30కి పైగా ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం ద్వారా ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఆమోదం పొందిన ప్రతి అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు, వాటి అమలుకు తీసుకోబోయే చర్యలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్