ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ దివాకర టీఎస్
ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పలు మండలాల్లోని అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
కలెక్టర్


ఖమ్మం, 10 నవంబర్ (హి.స.)

ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పలు మండలాల్లోని అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగిరెడ్డిపాలెం, శంకరగిరి తండా, కూసుమంచి మండలం మల్లెపల్లి, ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురం గ్రామాలలో అసంపూర్తి ఇళ్లను కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అదే స్థాయి నుంచి పూర్తి చేసుకునేందుకు అంగీకారంతో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేర్వేరు దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన రెండు పడక గదుల ఇళ్లను యథాస్థితిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తిగా పారదర్శక పద్ధతిని పాటించాలని తెలిపారు. ఇళ్ల సముదాయాల దగ్గర విద్యుత్, శానిటరీ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande