కొత్తూరులో పెద్దపులి సంచారం.. పశువులపై దాడితో గ్రామస్థుల్లో భయం
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వేలేరుపాడు మండలం కొత్తూరు గ్రామ పరిసరాల్లో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
नामेरी टाइगर रिजर्व। NAMERI TIGER RESERVE


ఏలూరు , 10 నవంబర్ (హి.స.)

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వేలేరుపాడు మండలం కొత్తూరు గ్రామ పరిసరాల్లో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గ్రామంలోకి వచ్చిన పెద్దపులి ఓ ఆవుతో పాటు రెండు దూడలపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పశువులపై పెద్దపులి దాడి విషయం తెలియడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పంట పొలాలు, గ్రామ శివారు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లే రైతులు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఆందోళన చెందుతున్నారు.

పెద్దపులి సంచారంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పెద్దపులి కదలికలను గుర్తించాలని కోరుతున్నారు. పులిని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామస్థులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande