
అమరావతి , 13 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల పెరుగుదల రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం నమోదైన గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి.
సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. అక్టోబర్లో ఏపీలో ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 13.23 శాతానికి చేరినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది ఆందోళనకర స్థాయిగా పరిగణిస్తున్నారు.
కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్