
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)
అంతర్జాతీయ క్రికెట్ మండలి 2035 వరకు జరగనున్న పురుషుల ప్రధాన టోర్నీల క్యాలెండర్‌ను ఫైనల్ చేసింది. ఇందులో భారత్‌కు రెండు భారీ టోర్నీలు దక్కడం విశేషం.
ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు భేటీలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2029లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అక్టోబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించిన భారత్‌కు మరో ప్రతిష్టాత్మక టోర్నీ దక్కింది. అలాగే 2031 వన్డే ప్రపంచకప్‌ను భారత్, బంగ్లాదేశ్ కలిసి నిర్వహించనున్నాయి. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌ల వేదికలను కూడా ఐసీసీ ప్రకటించింది. 2028 ఎడిషన్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అక్టోబర్-నవంబర్ మధ్య ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. 2030 టీ20 వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ మూడు దేశాలు కలిసి నిర్వహించనున్నాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌ను రెండేళ్లకు ఒకసారి నిర్వహించే విధానాన్ని ఐసీసీ కొనసాగించనుంది. రాబోయే రెండు ఫైనల్స్‌కు ఇంగ్లండ్‌నే వేదికగా ఎంపిక చేశారు. 2029 ఫైనల్ జూన్ 8 నుంచి 12 వరకు, 2031 ఫైనల్ జూన్ 12 నుంచి 16 వరకు జరగనున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు