పెట్రోల్ బంక్లో అగ్నిప్రమాదం.. బైక్ దగ్ధం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్లోని కేపీహెచ్బీ పరిధిలో పెట్రోల్ బంక్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
పెట్రోల్ బంక్లో అగ్నిప్రమాదం.. బైక్ దగ్ధం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


హైదరాబాద్ , 17 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని కేపీహెచ్బీ పరిధిలో పెట్రోల్ బంక్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బైక్కు పెట్రోల్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ తీవ్ర కలకలం నెలకొంది. క్షణాల్లోనే మంటలు బైక్ మొత్తానికి వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అగ్నిమాపక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు బంక్లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

అయితే, ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెట్రోల్ నింపే సమయంలో మంటలు ఎలా చెలరేగాయనే అంశంపై వివరాలు వెల్లడికావాల్సి ఉంది. బంక్లో ప్రమాదం జరగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెట్రోల్ బంకుల్లో భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని పలువురు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande