సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దామోదర
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి దామోదర పరిశీలించారు
Minister


సిద్దిపేట, 18 నవంబర్ (హి.స)

ఈ నెల 19వ తేదీ గురువారం సిద్దిపేటలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు చేస్తున్న ఏర్పాట్లను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం స్వయంగా వెళ్లి పరిశీలించారు . సభా వేదిక, ఇతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష చేశారు. సీఎం జిల్లా పర్యటనను అన్ని శాఖల అధికారులు కలిసి విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేస్తారని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా గట్టి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

సభకు పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్నందున సభా వేదిక, కుర్చీలు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర కరెంటు, సౌండ్ సిస్టమ్, వైద్య శిబిరం, అంబులెన్సులు, హెలిప్యాడ్, సీఎం పాదయాత్ర మార్గం, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై మంత్రి సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకుని సభను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande