టీడీపీ కార్యాలయంలో కూటమి అగ్రనేతల మీడియా సమావేశం
ఆంధ్రప్రదేశ్లో రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలు రాజకీయంగా తమ కార్యాచరణను వేగవంతం చేశారు.
టీడీపీ కార్యాలయంలో కూటమి అగ్రనేతల మీడియా సమావేశం


అమరావతి , 18 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలు రాజకీయంగా తమ కార్యాచరణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి అగ్రనేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలవాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

రాబోయే ఎన్నికలను కూటమి పార్టీలకు అత్యంత కీలకంగా భావిస్తున్నట్లు నేతల మాటలను బట్టి స్పష్టమవుతోంది. గ్రామస్థాయిలో కూడా కూటమి బలాన్ని నిరూపించుకోవాలని నాయకులు భావిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలు కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో పార్టీల మధ్య ఐక్యతను కొనసాగించాలని, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు. ఈ మీడియా సమావేశం ద్వారా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు తమ వైఖరిని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలోనూ కూటమి ఆధిపత్యాన్ని కొనసాగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande