హైదరాబాద్ కు అమిత్ షా.. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి (update)
ఢిల్లీలో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన నిరసనలకు కౌంటర్గా బీజేపీ హైదరాబాద్లో భారీ పాదయాత్రకు సిద్ధమైంది.
amith


హైదరాబాద్ , 02 నవంబర్ (హి.స.)

ఢిల్లీలో ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన నిరసనలకు కౌంటర్గా బీజేపీ హైదరాబాద్లో భారీ పాదయాత్రకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ‘లోక్తంత్ర బచావో – అరాచకత హఠావో’ అనే నినాదంతో నిర్వహించనున్న మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు.

ముందుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర నాయకులు, పార్టీ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం కావాలని ప్రార్థనలు చేసిన అనంతరం ఆలయం నుంచి బయలుదేరారు.

తదుపరి ఆయన బంజారాహిల్స్లోని ఐటీసీ కాకతీయ హోటల్కు చేరుకోనున్నారు. అక్కడ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో పాదయాత్ర ఏర్పాట్లు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande