
వరంగల్, 02 నవంబర్ (హి.స.)
ఎయిడ్స్ నివారణ జిల్లాగా వరంగల్ లక్షాన్ని సాధించిందని జిల్లా కలెక్టర్ డా సత్య శారద అన్నారు.
జిల్లా 95-95-95 లక్ష్యాల సాధన –సన్మాన కార్యక్రమం,ఎవత్స్ క్లినికల్ కమిటీ సమావేశం నెలవారీ సమీక్ష సమావేశం సోమవారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాలయం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఎచ్ఐవి నివారణ,నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో ) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాలను సాధించి, “సురక్షిత్ జిల్లా” హోదాను పొందినందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రాజి రెడ్డి ని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ స్వప్నమాధురి,సహయోగి ప్రతినిధి మంజులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు