సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు.... సీ.పీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు.
Cp


హైదరాబాద్, 02 నవంబర్ (హి.స.)

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు.

నవంబర్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు 15 రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

ఆయా కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే సంబంధిత ఏసీపీ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్ల పేరుతో వివిధ కారణాలను చూపుతూ సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయాలని ఒత్తిడి చేయడం, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సిటీ పోలీస్ యాక్ట్, పోలీస్ యాక్ట్ 1861, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande