
భూపాలపల్లి, 02 నవంబర్ (హి.స.)
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్, గడ్చిరోలి జిల్లా కలెక్టర్ అవిశాంత్ పండా సోమవారం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు వేదాశీర్వచనం అందించి శేషవస్త్రాలతో సత్కరించారు.
అనంతరం త్రివేణి సంగమం సమీపంలోని సరస్వతీ పుష్కర ఘాట్‌ను సందర్శించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివరించారు. అనంతరం పునర్నిర్మాణంలో ఉన్న ఆలయ అభివృద్ధి పనులను ముగ్గురు కలెక్టర్లు, మహారాష్ట్ర సీఎస్ పరిశీలించి పనుల పురోగతి, నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు