విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో పర్యటించనున్నారు.
Chandrababu


అమరావతి , 02 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న మురసు తుపాను పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముందుగా విజయవాడలోని పోలీస్ ఏఆర్ గ్రౌండ్లో దివంగత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి నివాళులర్పించనున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించనున్నారు.

అనంతరం ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకోనున్నారు. అక్కడ తుపాను ప్రభావం, వాతావరణ పరిస్థితులు, సహాయక చర్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించే అవకాశం ఉంది.

విద్యుత్ సరఫరా, రహదారులు, రవాణా, పంట నష్టం, ప్రజల భద్రత వంటి అంశాలపైనా సీఎం వివరాలు తెలుసుకోనున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా సంబంధిత శాఖలను అప్రమత్తం చేయనున్నారు. తుపాను నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని చంద్రబాబు ఆదేశించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande