
హైదరాబాద్, 02 నవంబర్ (హి.స.)
తెలంగాణలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం వంటి కనీస అవసరాలకు కూడా నిధులు అందడం లేదని ఆవేదన చెందారు. గతంలో ప్రారంభించిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు.
పాత పనులకే డబ్బులు విడుదల కానప్పుడు కొత్త పనులు ఎలా చేపట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు సాధించే విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిధులు తీసుకురావడమే తన లక్ష్యమని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..