
పెద్దపల్లి, 02 నవంబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని బాలసదన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిశుగృహాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ప్రారంభించారు.
శిశుగృహలో పిల్లలకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన పోషకాహారం, అవసరమైన వైద్య సదుపాయాలు, తగిన సంరక్షణ అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా శిశుగృహలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, చిన్నారులకు అందించే సంరక్షణ, వసతుల వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..చిన్నారుల భద్రత, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.
తల్లిదండ్రుల సంరక్షణకు నోచుకోని, వదిలివేయబడిన, అనాథ, సంరక్షణ అవసరమైన పసిపిల్లలకు సురక్షితమైన ఆశ్రయం కల్పించడమే శిశుగృహ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
శిశుగృహలో పిల్లలకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన పోషకాహారం, అవసరమైన వైద్య సదుపాయాలు, తగిన సంరక్షణ అందించాలని ఆదేశించారు. జననం నుంచి ఆరేళ్లలోపు వయస్సు గల చిన్నారులకు ప్రేమపూర్వక సంరక్షణ, పోషకాహారం, వైద్య సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణతో పాటు వయస్సుకు తగిన అభివృద్ధి అవకాశాలను ఈ కేంద్రం ద్వారా అందించనున్నట్లు తెలిపారు.
పిల్లలకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు, వారి అవసరాలకు అనుగుణంగా మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..