కాంగ్రెస్పై అమిత్ షా ధ్వజం: 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' అంటూ ట్వీట్
కాంగ్రెస్పై అమిత్ షా ధ్వజం: 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' అంటూ ట్వీట్
AMITH SHAH


హైదరాబాద్, 02 నవంబర్

(హి.స.)

హైదరాబాద్‌లో బీజేపీ చేపట్టిన పాదయాత్ర

సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో

కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్

పూర్తిగా కుదేలైందని ఆరోపించిన ఆయన,

ఇప్పుడు దేశంలో అరాచకాలు సృష్టించైనా

అధికారంలోకి రావాలని చూస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.ప్రజాస్వామ్యాన్ని

ఖూనీ చేసైనా సరే అధికారాన్ని దక్కించుకోవడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని

ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను ప్రజలు భగ్నం చేసి, దేశ

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఇవాళ తాము

హైదరాబాద్ నగరంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపిన అమిత్ షా,'ప్రజాస్వామ్యాన్ని

రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం'అనే నినాదంతో పోస్ట్

చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande