
మెదక్ జిల్లా, 02 నవంబర్ (హి.స.)
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో
విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రముఖ సినీ నటి, ‘టీచ్ ఫర్ ఛేంజ్’ (Teach for Change) ట్రస్ట్
వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి కీలక అడుగు వేశారు.మెదక్ జిల్లా
పరిధిలోని 48 ప్రభుత్వ ప్రాథమిక,
ప్రాథమికోన్నత పాఠశాలలను తన స్వచ్ఛంద
సంస్థ ద్వారా దత్తత తీసుకుంటున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.
ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో
డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు, స్మార్ట్ బోర్డులు,
లైబ్రరీల అభివృద్ధి, సమగ్ర బోధనా సామాగ్రి
అందించడంతో పాటు విద్యార్థులలో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు మరియు పునాది
అక్షరాస్యతను పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యను అందించడమే తమ సంస్థ ప్రధాన
లక్ష్యమని ఈ సందర్భంగా మంచు లక్ష్మి పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారులతో సమన్వయం
చేసుకుంటూ ఉపాధ్యాయులకు డిజిటల్ బోధనా పద్ధతులపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా
విద్యా అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన ఈ నిర్ణయాన్ని స్థానిక ప్రజలు, విద్యావేత్తలు మరియు
అధికారులు అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi