కార్తిక దీపోత్సవానికి ప్రత్యేక రైళ్లు.. భక్తులకు రైల్వే శాఖ శుభవార్త
కార్తిక దీపం మహోత్సవాలను పురస్కరించుకుని అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది.
train


హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)

కార్తిక దీపం మహోత్సవాలను పురస్కరించుకుని అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. తమిళనాడులోని తిరువణ్ణామలైలో జరిగే ఈ ప్రసిద్ధ దీపోత్సవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఈ మేరకు విశాఖపట్నం నుంచి తిరువణ్ణామలైకు ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పండుగ సమయంలో సాధారణ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఈ అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రత్యేక రైళ్లతో అరుణాచలం వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వెళ్లే యాత్రికులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. ప్రత్యేక రైళ్ల రాకపోకల తేదీలు, సమయాలు, నిలుపుదల స్టేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే శాఖ ప్రకటించనుంది. భక్తులు ప్రయాణానికి ముందుగా అధికారిక రైల్వే సమాచారం పరిశీలించి టికెట్లు రిజర్వు చేసుకోవాలని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande