రాణిగంజ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. 8 నెలల పాటు వాహనాల మళ్లింపు
హైదరాబాద్లోని సికింద్రాబాద్ రాణిగంజ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
mekhri-circle-hebbal-elevated-corridor-bellary-road-traffic-diversion-18-months


హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని సికింద్రాబాద్ రాణిగంజ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ చేపట్టనున్న రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ పనుల కారణంగా రేపటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు సుమారు ఎనిమిది నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. రాణిగంజ్ మీదుగా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లేవారు, రోజువారీ ప్రయాణాలు చేసే వారు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరారు.

నిర్మాణ పనుల సమయంలో వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు పోలీసుల సూచనలు, ట్రాఫిక్ సిబ్బంది ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తూ సహకరించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande