విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల విలువైన బొమ్మలు దగ్ధం
విజయవాడలోని ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ బొమ్మల తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.
11 killed in fire in Thailand's Phuket province


అమరావతి , 21 నవంబర్ (హి.స.)విజయవాడలోని ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ బొమ్మల తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రికల్ బొమ్మలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కంపెనీలో నిల్వ ఉంచిన బొమ్మలు, ఇతర సామగ్రి భారీగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అగ్నికీలలు మరింత విస్తరించకుండా ఫైర్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఈ కంపెనీలో తయారయ్యే ఎలక్ట్రికల్ బొమ్మలను నిర్వాహకులు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రమాదం కారణంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రమాద సమయంలో కంపెనీలో కార్మికులు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande