వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నంలో వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Ram mohan naidu


విశాఖపట్నం, 21 నవంబర్ (హి.స.)

విశాఖపట్నంలో వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విమానయాన రంగ విస్తరణ, పర్యాటక అభివృద్ధిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్కు సుమారు రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలకంగా మారనుందని తెలిపారు. ఈ విమానాశ్రయాన్ని ప్రధాన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులను క్రమంగా పెంచుతున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలకు విమాన కనెక్టివిటీని విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు నేరుగా విమాన సర్వీసు ప్రారంభించే ప్రణాళిక ఉందని తెలిపారు.

అలాగే శ్రీకాకుళం, కుప్పం ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ ఇచ్చినట్లు చెప్పారు. నాగార్జునసాగర్ సామర్థ్యాన్ని పెంచే చర్యలు కూడా చేపడుతున్నామని వివరించారు. విమానయాన సదుపాయాల విస్తరణతో రాష్ట్రంలో పర్యాటకం, వాణిజ్యం మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande