మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపుత్రులకు లోకేశ్ శుభాకాంక్షలు
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
Lokesh


అమరావతి , 21 నవంబర్ (హి.స.)

ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న మత్స్యకారుల సేవలను ఆయన కొనియాడారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక గొప్ప వరమని, ఇది మత్స్య సంపద అభివృద్ధికి, మత్స్యకారుల జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మత్స్యకారుల సంక్షేమం, వారి ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న 'మత్స్యకారుల సేవలో' పథకం ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

సముద్రంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు మత్స్యకారులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. వారి కుటుంబాల సంక్షేమం, పిల్లల భవిష్యత్తు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపుత్రులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande