
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)
దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సందీప్‌కుమార్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టేందుకు సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ప్రపంచంలోని ఇతర దేశాల రాజ్యాంగాలతో పోలిస్తే ప్రత్యేకమైనదని సందీప్‌కుమార్ వివరించారు. దేశ చరిత్ర, ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాజ్యాంగంలోని ప్రధాన ఆశయాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ నిర్మాణంలోనూ పార్టీ ముఖ్యమైన బాధ్యత నిర్వర్తించిందని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను కాపాడుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ప్రజాస్వామ్యబద్ధమైన దేశాన్ని అందించాలంటే రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సందీప్‌కుమార్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్