ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కార్యక్రమానికి మంచి స్పందన: డీజీపీ
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కార్యక్రమానికి మంచి స్పందన: డీజీపీ


హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రహదారులపై వాహనాల రద్దీని నియంత్రించి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా వన్వే విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.

నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే పలు చర్యలు సమాంతరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రహదారుల విస్తరణ జరిగితే వాహనాల రాకపోకలకు మరింత వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. రహదారుల సామర్థ్యం పెరగడం వల్ల రద్దీని కొంతమేర తగ్గించవచ్చని పేర్కొన్నారు.

ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. వన్వే నిబంధనలను పాటించడం, ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించడం ద్వారా ప్రయాణాలను సులభతరం చేయవచ్చని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande