రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వ్యవసాయాధికారి
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ ప్రభుత్వ ఉద్యోగిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Acb


హైదరాబాద్ , 03 నవంబర్ (హి.స.)

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ ప్రభుత్వ ఉద్యోగిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఏఈవో రమేశ్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ ఎరువుల వ్యాపారిని పనికి సంబంధించి మొత్తం రూ.30 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికే సదరు వ్యాపారి నుంచి రూ.10 వేలు తీసుకున్న రమేశ్.. మిగిలిన రూ.20 వేల కోసం ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో లంచం ఇవ్వడం ఇష్టంలేని వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వ్యాపారి నుంచి రమేశ్ మరో రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ బృందం నేరుగా దాడి చేసి పట్టుకుంది.

అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అవినీతికి పాల్పడే ఉద్యోగులపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande