బాపట్ల జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం.. రైళ్ల నిలిపివేత
బాపట్ల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Train


బాపట్ల , 03 నవంబర్ (హి.స.)

బాపట్ల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురసు తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షపు తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. బలమైన గాలులు వీస్తుండటంతో రహదారులపై రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. బాపట్ల రైల్వే స్టేషన్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. జయపుర–చెన్నై ఎక్స్ప్రెస్తో పాటు విశాఖపట్నం–చెన్నై ఎక్స్ప్రెస్ రైలును కూడా స్టేషన్లో ఆపారు. వర్షం, ఈదురుగాలుల కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రైళ్ల నిలిపివేతతో ప్రయాణికులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న రైల్వే అధికారులు, పరిస్థితులు అనుకూలించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉంది. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రయాణికులు రైల్వే శాఖ సూచనలను పాటించాలని, ప్రయాణానికి ముందు రైళ్ల తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande