92 గిగావాట్ల ఇంధన నిల్వ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భవిష్యత్తులో ఇంధన అవసరాలను సమర్థంగా తీర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
karnataka-electricity-bill-hike-40-50-paise-per-unit-october-november


అమరావతి , 04 నవంబర్ (హి.స.)

దేశంలో విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భవిష్యత్తులో ఇంధన అవసరాలను సమర్థంగా తీర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 92 గిగావాట్ల సామర్థ్యంతో ఇంధన నిల్వ పథకాలను అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పంప్డ్ హైడ్రో విద్యుత్ నిల్వ వ్యవస్థలకు 60 గిగావాట్లు, బ్యాటరీ ఆధారిత నిల్వ విధానాలకు 30 గిగావాట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో స్థిరత్వం పెరగడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.

మరోవైపు దేశంలో కీలకమైన ఖనిజాల లభ్యత, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు రూపొందించిన ప్రత్యేక పథకానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గుర్తించిన 24 రకాల క్లిష్టమైన ఖనిజాల శుద్ధి, ప్రాసెసింగ్కు ఈ పథకం వర్తించనుంది. ఇవి భవిష్యత్తు సాంకేతిక రంగాలకు ఎంతో అవసరమైనవిగా ప్రభుత్వం భావిస్తోంది.

ఇక పిల్లలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 850 ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాలను బలోపేతం చేసి కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. తద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande