రామచంద్రాపురం వైఎస్సార్సీపీలో విభేదాలు.. ఓటమిపై సొంత పార్టీ నేతలపైనే అభ్యర్థి ఆరోపణలు
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో స్థానిక ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలకు తెరలేపాయి.
YSRCP


రామచంద్రాపురం, 04 నవంబర్ (హి.స.)

కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో స్థానిక ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలకు తెరలేపాయి. ఛైర్పర్సన్ ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో పార్టీ నేతలు, అభ్యర్థుల మధ్య అసంతృప్తి బయటపడింది. తన ఓటమికి ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీ నాయకులే కారణమని వైఎస్సార్సీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి నాగేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, సూర్యప్రకాష్ వ్యవహారశైలే తన ఓటమికి కారణమని ఆరోపించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ను నమ్మి ఎన్నికల బరిలోకి దిగానని, చివరకు ఆయన నుంచి సహకారం అందక తీవ్రంగా నష్టపోయానని పేర్కొన్నారు. ప్రచారానికి రావాలని పలుమార్లు కోరినప్పటికీ స్పందించలేదని విమర్శించారు.

పార్టీ నాయకత్వంపై నమ్మకం పెట్టుకుని పోటీ చేసిన తనకు తగిన మద్దతు లభించలేదని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పార్టీ నేతలను గుడ్డిగా నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. ఈ పరిణామాలతో రామచంద్రాపురం వైఎస్సార్సీపీలో రాజకీయ వేడి పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande