
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఆయురారోగ్యాలతో, సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ప్రజాసేవలో ఆయన మరింత కాలం కొనసాగాలని, తెలంగాణ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసే అవకాశం కలగాలని కేంద్ర మంత్రులు అభిలషించారు. ప్రజల సంక్షేమం కోసం మరింత ఉత్సాహంతో పనిచేసేలా భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుకున్నారు. రేవంత్రెడ్డి రాజకీయ, ప్రజా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, పార్టీ నాయకులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. రాజకీయంగా విభిన్న పార్టీలకు చెందిన కేంద్ర మంత్రులు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా రేవంత్రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్