
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ బదిలీలు, నిషేధిత భూముల జాబితా మార్పులు మరియు అక్రమ రిజిస్ట్రేషన్లపై సిఐడి (CID) అధికారులు విచారణను తీవ్రతరం చేశారు. పలు జిల్లాల్లోని రెవెన్యూ కార్యాలయాలపై ఆకస్మిక సోదాలు నిర్వహిస్తూ, ల్యాండ్ రికార్డుల్లో జరిగిన మార్పులను దర్యాప్తు బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ధరణి డేటాబేస్ దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపడుతున్నారు.
విచారణలో భాగంగా ఐటీ నిపుణులు మరియు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమంగా పట్టాలు పొందిన వారి వివరాలు, దానికి సహకరించిన అధికారుల పాత్రపై సీఐడీ నివేదిక సిద్ధం చేస్తోంది. బాధితులైన రైతులకు న్యాయం చేయడంతో పాటు, భూమి రికార్డులను పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ‘భూ భారతి’ చట్టానికి ఈ విచారణ నివేదిక కీలక కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్