మైలార్ దేవులపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.. రెండు గోదాములకు వ్యాపించిన మంటలు
హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఓ ప్లాస్టిక్ గోదాములో అనూహ్యంగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
Fire accident


హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోనిమైలార్ దేవులపల్లి పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఓ ప్లాస్టిక్ గోదాములో అనూహ్యంగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ప్లాస్టిక్ వస్తువులు పెద్దఎత్తున నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాముకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో రెండు గోదాముల్లోనూ దట్టమైన పొగలు, భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. మంటలు మరింత విస్తరించకుండా పరిసర ప్రాంతాల్లో అప్రమత్తత పాటిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande