ఎల్నినో హెచ్చరికలు – వ్యవసాయం, నీటి నిర్వహణపై ప్రభుత్వం దృష్టి
రాబోయే కాలంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
Telangana govt


హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)

రాబోయే కాలంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి నిల్వలు మరియు తాగునీటి సరఫరా నిర్వహణపై జలమండలి, నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. రిజర్వాయర్లలో నీటిని సక్రమంగా వినియోగించుకుంటూ, యాసంగి పంటలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.

అలాగే, రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 'రైతు భరోసా' పథకం మార్గదర్శకాలను ఆమోదించే పనిలో ప్రభుత్వం ఉంది. పంట నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు, తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైతులు వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande