
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ నగరం నుండి వికారాబాద్ మరియు కొడంగల్ ప్రాంతాలకు రాకపోకలను సులభతరం చేసేందుకు షామ్షాబాద్ - కొడంగల్ రేడియల్ రోడ్డు ప్రాజెక్టును ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మరియు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) అనుసంధానాన్ని పెంచేలా ఈ నూతన రోడ్డు మార్గాన్ని డిజైన్ చేశారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా డిసెంబర్ 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రవాణా, రహదారుల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ రేడియల్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పారిశ్రామిక రవాణాతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల శీఘ్ర రవాణాకు మార్గం సుగమమవుతుంది. రహదారి విస్తరణ కోసం సేకరించాల్సిన భూముల జాబితాను సిద్ధం చేసి, నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు అందాయి. ఈ రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దు జిల్లాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్