స్టాక్‌మార్కెట్లపై పన్ను దెబ్బ.. 2000 పాయింట్లు పతనం
ముంబై,01 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బడ్జెట్‌లో కంపెనీల బైబ్యాక్‌పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను పెంచడం మార్కెట్లను కుదిపేసింది. దీంతో ఉదయం 12.30 గంటల స
Pressure on stock market in early trade, Sensex and Nifty fall


ముంబై,01 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బడ్జెట్‌లో కంపెనీల బైబ్యాక్‌పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను పెంచడం మార్కెట్లను కుదిపేసింది. దీంతో ఉదయం 12.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1367 పాయింట్లు క్షీణించి 80,675 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 535 పాయింట్లు పతనమై 24,785 వద్ద కదలాడుతోంది. ఒకదశలో సెన్సెక్స్ 2000పాయింట్లు, నిఫ్టీ 700 పాయింట్లకు పైనే పడిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande