వైసిపి నేత మాజీ మంత్రి.అంబటి రాంబాబుకు మరోసారి.14 రోజుల రిమాండ్
గుంటూరు, 12 ఫిబ్రవరి (హి.స.) వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు మరోసారి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండగ వేళ.. సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో బలవంత
వైసిపి నేత మాజీ మంత్రి.అంబటి రాంబాబుకు మరోసారి.14 రోజుల రిమాండ్


గుంటూరు, 12 ఫిబ్రవరి (హి.స.)

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు మరోసారి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండగ వేళ.. సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు కొనుగోలు చేసేలా వ్యవహరించిన కేసులో అంబటి రాంబాబుకు న్యాయమూర్తి ఈ రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు అంబటి రాంబాబును భారీ బందోబస్తు నడుమ తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande