
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.)
:ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల (చిన్న వెంకన్న) ఆలయంలో ప్రసాదాల తయారీలో కల్తీ జరిగిందని సిటనివేదికలో ప్రస్తావించింది. సిట్ నివేదిక వెల్లడించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్వామివారికి ఎంతో పవిత్రంగా భావించి సమర్పించే ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడినట్లు తేలడంపై భక్తుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ