ఆంధ్రప్రదేశ్.శాసనసభ శాసనమండలి.వాయిదా
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.) , ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసన మండలి వాయిదా పడ్డాయి. శాసనసభ వాయిదా పడిన కొద్దిసేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఉదయం రెండు సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభల్లో గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై
ఆంధ్రప్రదేశ్.శాసనసభ శాసనమండలి.వాయిదా


అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.)

, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసన మండలి వాయిదా పడ్డాయి. శాసనసభ వాయిదా పడిన కొద్దిసేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఉదయం రెండు సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభల్లో గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇక శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి పార్థసారథి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకానొక దశలో ఈ ఇరువురు ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. దాంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాసన మండలి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande