
నెల్లూరు, 12 ఫిబ్రవరి (హి.స.)
,ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీలో ఇటీవల ఓ బాలిక మృతి ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి కాకాణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో పోలీసులు ఆయనను విచారణకు రావాలని ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ