
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.)లిక్కర్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. అలాగే వీరి బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టును సిట్‌కు ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ