
అంబేడ్కర్ కోనసీమ జిల్లా,, 12 ఫిబ్రవరి (హి.స.)
మామిడికుదురు మండలంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలో ఈరోజు (గురువారం) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం వల్ల 13 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరికొన్ని ఇళ్లకు మంటలు వ్యాపించకుండా త్వరితగతినే మంటలను అదుపుచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ