
హైదరాబాద్, 12 ఫిబ్రవరి( హిం స): హైడ్రా కూల్చివేతల ఎపిసోడ్ మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. మాదాపూర్ ఖానామెట్‌లో ఆలయ స్థలంలో నిర్మించిన షాప్‌లను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను కూల్చివేయడంపై ఆలయ పూజారులు, భక్తులు, గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ అధికారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు