వాలెంటైన్స్ డే పేరుతో వలపు వలలో పడొద్దు’
హైదరాబాద్, 12 ఫిబ్రవరి (హి.స.)వాలంటైన్స్‌ డే పేరుతో ఎవరూ కూడా వలపు వలలో పడొద్దని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. వాలెంటైన్స్ డే అంటే కేవలం గులాబీలే కాదు.. ప్రమాద ఘంటికలు కూడా! సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్‌లో మీరు తోడు కోసం వెతుకుతుంటే.. సైబర్ కేటు
వాలెంటైన్స్ డే పేరుతో వలపు వలలో పడొద్దు’


హైదరాబాద్, 12 ఫిబ్రవరి (హి.స.)వాలంటైన్స్‌ డే పేరుతో ఎవరూ కూడా వలపు వలలో పడొద్దని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. వాలెంటైన్స్ డే అంటే కేవలం గులాబీలే కాదు.. ప్రమాద ఘంటికలు కూడా! సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్‌లో మీరు తోడు కోసం వెతుకుతుంటే.. సైబర్ కేటుగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి కాచుకుని ఉంటారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ కూడా వలపు వలలో పడొద్దన్నారు.

పరిచయం అయిన వెంటనే 'ఐ లవ్ యూ' చెప్పడం, విదేశాల్లో ఉన్నామంటూ గొప్పలు చెప్పడం, హఠాత్తుగా ఆపద వచ్చిందని నాటకాలాడటం.. ఇవన్నీ మిమ్మల్ని బుట్టలో వేసుకునే ఎత్తుగడలేనన్న విషయం గ్రహించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande