
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలతో పాటు వడగండ్ల వాన కూడా కొన్ని ప్రాంతాల్లో పంటలను దెబ్బతీసింది.. అయితే, రేపు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. ద్రోణి ప్రభావంతో గురువారం (26-02-26) శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు