
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్‌కు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న రచ్చ పరాకాష్టకు చేరడంతో పంజాగుట్ట పోలీసులు తాజాగా అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విశాఖపట్నానికి చెందిన అన్వేష్ విదేశాల్లో పర్యటిస్తూ వీడియోలు చేస్తుంటాడు. అయితే గత ఏడాది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హిందూ ధర్మంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ నటి కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు విదేశాల్లో ఉండటంతో విచారణకు సహకరించకపోవడంతో తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు