త్వరలో గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సులు
దిల్లీ: , 27 ఫిబ్రవరి (హి.స.)బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సుల వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ
త్వరలో గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సులు


దిల్లీ: , 27 ఫిబ్రవరి (హి.స.)బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సుల వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు భద్రతపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) గురువారం దిల్లీలో నిర్వహించిన జాతీయ కాంక్లేవ్లో ఆయన ప్రసంగించారు. ‘మేం గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సుల వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నాం.

ఈ విధానంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు కొన్ని పాయింట్లు తగ్గుతాయి. అలా మొత్తం పాయింట్లు తగ్గితే డ్రైవింగ్ లైసెన్సును 6 నెలలపాటు సస్పెండు చేయడంగానీ, పూర్తిగా రద్దు చేయడంగానీ చేస్తాం. త్వరలో ఈ విధానాన్ని ప్రారంభిస్తాం’ అని గడ్కరీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande